దామర వృద్ధ దంపతుల ఉపాధి కోసం ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ సాయం
నాంపల్లి , విశ్వంభర :- నాంపల్లి మండలం దామర గ్రామానికి చెందిన సంది నరసింహ ,ఎల్లమ్మ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మరణించడం జరిగింది.వృద్ధాప్యంలో ఉన్న ఈ దంపతులు ప్రభుత్వం నుండి ఎటువంటి పెన్షన్ పొందటం లేదు .వీరు నివాసం ఉంటున్న సిమెంటు ఇటుకల ఇల్లు వానలకు బాగా కురుస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ,సామాజిక కార్యకర్త గురిజ మహేష్ వారి ఇంటికి తాత్కాలిక మరమ్మత్తుకు సహాయం అందించడం జరిగింది. ఏదైనా ఉపాధి అవకాశం కల్పించమని అడగడం జరిగిందని తెలియజేసారు . వీరి పరిస్థితిని " ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ " స్థాపకులు నాగమోహన్ కు వివరించగా వారు వెంటనే స్పందించి వారి సిమెంటు ఇటుకల ఇల్లు కురవకుండా టర్పంటైన్ కవర్ను అందించి వారికి ఏదైనా ఉపాధి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు . ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ,సామాజిక కార్యకర్త గురిజ మహేష్ వెంటనే స్పందించి సహాయం అందించిన ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ నాగమోహన్ సార్ కి వృద్ధ దంపతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.