తిమ్మాపూరం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలన

WhatsApp Image 2024-07-09 at 4.57.40 PM

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 09 : 

Read More నాటి వీర నారీల స్ఫూర్తితో ముందుకు సాగాలి..- సున్నితత్వంతో పాటు  శూరత్వం కలిగి ఉండాలి..

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తిమ్మాపూరం గ్రామంలో  మంగళవారం రోజు ఎంపీడీఓ ఎండీ నిరంజన్ వలీ ఎంపీఓ జులూరు పద్మావతి శానిటేషన్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమం వరకు గుంతలు తీసి మొక్కలు నాటటానికి సిద్ధం చేయాలని అన్నారు. గుంతలను ఉపాధి హామీ పథకంలో నిర్ధేశించిన కోలతల ప్రకారం తీసి 300 రూపాయల వేతనం తీసుకోవాలని కూలీలకు సూచించారు. వీరివెంటా పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉపాధి హామీ ఏఫ్ఏ రవిందర్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, కూలీలు ఉన్నారు.