మహిళా శక్తి క్యాంటీన్ ల ఏర్పాటు

WhatsApp Image 2024-07-23 at 15.58.02_450c2939

విశ్వంభర భూపాలపల్లి జూలై  23 : - మహిళల ఆర్థిక స్వావలంబన నకు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై ఐడివోసీలో రూములను పరిశీలించారు.  ఈ సందర్భంగా క్యాంటీన్ ఏర్పాటు గురించి డిఆర్డీఓ నరేష్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం
జిల్లాలోని అన్ని మండలాలల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు అలాగే ఐడిఓసి కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు మహిళా సంఘాల ద్వారా ప్రతిపాదనలు స్వీకరించాలని డిఆర్డీఓను ఆదేశించారు.  ఐడిఓసిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయకున్న క్యాంటీన్   నాణ్యతకు ఆదర్శంగా  నిలవాలని ఆయన తెలిపారు.  సాంప్రదాయ వంటకాలను జిల్లా ప్రజలకు  పరిచయం చేయాలని ఆయన పేర్కొన్నారు.  స్థానికంగా లభ్యమయ్య వనరులు, వస్తువులు ఆధారంగా అవసరాలకు తగ్గట్టుగా మహిళా శక్తి క్యాంటీన్ కు బిజినెస్ మోడల్స్ రూపొందించాలని డిఆర్డీఓ కు సూచించారు. మన జిలాల్లో మండల, ఐడిఓసి కార్యాలయంలో  ఏర్పాటు చేయనున్న  మహిళా శక్తి క్యాంటీన్లు మోడల్ గా ఉండాలని ఆయన పేర్కొన్నారు.  మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని  మహిళలు సద్వినియోగం చేసుకుని వ్యాపార వేత్తలుగా ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆయన అన్నారు. 
 ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More చట్టాలపై అవగాహన సదస్సు ..