బీజేవైఎం ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్

6 విశ్వంభర భూపాలపల్లి జూలై 15 :- డిఎస్సి వాయిదా వేయాలని గ్రూప్ 1,2 పోస్ట్ లు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా భూపాలపల్లి జిల్లా లో మహాదేవపూర్ మండలం లోని బీజేవైఎం,ఏబీవీపీ నాయకులను అర్ధరాత్రి 11 గంటల సమయం లో భారీ వర్షం లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్ట్ అయినా వారిలో బీజేవైఎం మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి జోగేశ్వర్ రావు కార్యదర్శి బల్ల సంపత్, ఏబీవీపీ నగర కార్యదర్శి పేట సాయి, నాయకులు గోగుల కృష్ణ, రవితేజ, సుశాంత్, వెంకటేష్, సంజయ్ లు ఉన్నారు...