రాష్ట్ర బడ్జెట్ జనరంజక బడ్జెట్,అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

WhatsApp Image 2024-07-25 at 16.29.39_d277302d

విశ్వంబర కరీంనగర్  : - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గురువారం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ జనరంజకంగా ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్త్రీశిశు సంక్షేమం,ఎస్,ఎస్టీ మైనారిటీలతో పాటు బిసిల సంక్షేమానికి పెద్ద పీట వేశారని వ్యవసాయరంగంతో పాటు గ్రామీణాభవృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గృహజ్యోతి మరియు గ్యాస్ సబ్సిడీకి నిధులు కేటాయించారని అన్ని వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని నరేందర్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఈ బడ్జెట్ నిదర్శనం అని నరేందర్ రెడ్డి అన్నారు.

Read More రైతుల పై కాంగ్రెస్ ప్రభుత్వం  మొసలి కన్నీరు: మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్