దొంగలతో కలిసేవాళ్లను పట్టిచుకోవద్దు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీని వీడి దొంగలతో కలుస్తున్న వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. బీఆర్ ఎస్ కు ఇలాంటి పరిస్థితులు అసలు లెక్కే కాదన్నారు. ఎందుకంటే గతంలో సమైఖ్య వాదులతో కొట్లాడి అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్.
బీఆర్ ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం నిర్వహించారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి కదిలి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఈ పదేండ్లలో ఎంతో చేశామని చెప్పారు. ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగా లేదని.. కొందరు వెళ్లిపోతున్నారు.
అలాంటి వారిని పార్టీ పట్టించుకోదు. ఒకరు పార్టీ నుంచి పోతే పదిమందిని పార్టీ తీర్చిదిద్దుకుంటుందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. కార్యకర్తలే పార్టీకి అతిపెద్ద బలం అన్నారు. నాయకులు వెళ్తున్నారు తప్ప.. కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారని.. వారే పార్టీని అధికారంలోకి మళ్లీ తెస్తారని చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్.