మైనారిటీలకు నిరాశ
On
విశ్వంభర, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మైనారిటీలకు నిరాశ కలిగించిందని తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబ్బీర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో మైనారిటీ లకు ఇచ్చిన హామీలు మరిచిపోయి రూపొందించారా.? అంటూ ఆవేదన వ్యక్తం చేసారు . 5000 కోట్లు కేటాయింపులో కేవలం 3003 కోట్లు కేటాయించడం నిరాశ కలిగించిందని అన్నారు. మైనారిటీ లకు భరోసా ఇవ్వడంతో గడ్డుపరిస్తితుల్లో ఉన్న పార్టీ కి అండగా ఉండి అధికారం అందించి పూర్వవైభవాన్ని తీసుకొస్తే మైనారిటీలను విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి షబ్బీర్, ఎండి షాదుల్లా, మౌల హుస్సేన్, ఎండి దావుద్ ,ఎండి రియాజ్, ఎండి ఆలీ పాషా, అజ్మాత్ ,ఎండి మలాంగ్
తదితరులు పాల్గొన్నారు