రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం...! 

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం...! 

అకాల వర్షాలతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్ చెప్పారు. ఇవాళ (మంగళవారం) హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

అకాల వర్షాలతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్ చెప్పారు. ఇవాళ (మంగళవారం) హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. 

తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని.. వాతావరణ శాఖ సూచనలను రైతులకు అందించాలని సూచించారు. వర్ష సూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

Read More దిలావర్‌పూర్ రండి:కేటీఆర్‌

అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటు అని ఎద్దేవా చేశారు. 15 రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నామని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదన్నారు. మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని, రైతులెవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.

సన్నబియ్యానికే బోనస్ అనలేదు: భట్టి 

సన్న బియ్యానికే రూ.500 బోనస్ ఇస్తామని తాము అనలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రూ.500 బోనస్ ఇచ్చే పథకాన్ని సన్న బియ్యంతో మొదలుపెడుతామని చెప్పామని తెలిపారు.  రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది రైతు ప్రభుత్వమని వెల్లడించారు. తడిచినా, మొలకెత్తినా చివరి గింజ వరకు కొంటామని స్పష్టం చేశారు.