ప్రమాదకరంగా ప్రధాన రహదారులు
On
భారీ గుంతలతో వాహనదారుల ఇక్కట్లు
ముషీరాబాద్, జూలై 18(విశ్వంభర) : - ముషీరాబాద్ నియోజకవర్గం లో ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారాయి ఎక్కడ చూసినా భారీ స్థాయిలో గుంతలు ఏర్పడి వాహనదారులకు ప్రాణ సంకటంగా తయారయ్యాయి. నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ స్టీల్ బ్రిడ్జి దగ్గర లో ఉన్న సాయి వాణి హాస్పిటల్ ఎదురుగా గల ప్రధాన రహదారి పై భారీ స్థాయిలో గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తమ వాహనాలు గుంతలలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యపై మద్దెల ప్రభాకర్,అఫిజ్,సాయి,శివ కాంత్,నరసింహ జిహెచ్ఎంసి మరియు వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారులపై మరమ్మత్తు పనులు చేపట్టి గుంతలను పూడ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు...