పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అందచేసిన ఎస్సై ఎస్ కృష్ణయ్య
On
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 23 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అందచేసిన ఎస్సై ఎస్ కృష్ణయ్య. వారు మాట్లాడుతూ ప్రజలంతా వ్యక్తిగత వస్తువుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీ వస్తువులను కోల్పోకుండా ఉంటారు అని ఎస్సై అన్నారు.మండలానికి చెందిన ముగ్గురు మొబైల్ ఫోన్లు పోగొట్టుకునీ పోలీసులకు ఫిర్యాదు చేసినందున వారి ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సీఈఐఆర్ ద్వారా కనిపెట్టి బాధితులు ఆత్మకూరు కి చెందిన గట్టు శంకర్,రహీమ్ ఖాన్ పేటకు చెందిన మల్లయ్య, మోటాకొండూర్ మండలం తేర్యాలకు చెందిన చొప్పరి భిక్షపతి లకు అందచేసారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్సైకి పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.