కేసీఆర్, జగన్ ఓటమికి కారణం ఇదే...సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రుల పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతుల నిరసనలను జగన్ పట్టించుకోక పోవడమే జగన్ ఓటమికి కారణం అన్నారు. అదే విధంగా తెలంగాణలో కేసీఆర్ ధరణి స్కీమ్ తో పతనమైతే... ఆంధ్రప్రదేశ్ లో భూ రక్షణ పథకంతో జగన్ ప్రభుత్వం పడిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రైతులను, భూముల సమస్యలను పట్టించుకోకపోవడమే వీరిద్దరి ఓటమికి కారణమని నారాయణ అభిప్రాయపడ్డారు. ఇక, ఎన్నికల్లో ఘన విజయం సాధించి నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు ఈ సందర్భంగా నారాయణ అభినందనలు తెలిపారు. ఇక తెలంగాణలో గతేడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా... ఇటీవలే జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యి అధికారాన్ని కోల్పోయింది.