శ్రీవారి భక్తులను ఏమార్చి అక్రమ వసూళ్లకు పాల్పడే ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్
ఎవరైనా దళారులుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు తిరుపతి డిఎస్పి రవి మనోహర్ ఆచారి.
తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులను ఏమార్చి అక్రమంగా డబ్బులు గుంజుతున్న దళారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తిరుపతిలోని 6 మంది ఆటో డ్రైవర్లను తీవ్రంగా హెచ్చరిస్తూ తిరుపతి డిఎస్పి రవి మనోహరాచారి గారు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ ఆటో డ్రైవర్లు టీటీడీ యాప్ ను తమ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని రోజువారి అందుబాటులో ఉన్న శ్రీవారి దర్శన టోకెన్లను చూస్తారు. రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ వద్ద భక్తులకు ఎలాగైనా దర్శనం టోకెన్లు ఇప్పిస్తామని నమ్మబలికి విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస మంగాపురం ప్రాంతాలలో సర్వదర్శనం టోకెన్లు ఇచ్చు కౌంటర్ వద్ద సదరు భక్తులకు సర్వదర్శన టోకెన్లు ఇప్పించి అధిక మొత్తంలో అమాయక భక్తుల నుండి డబ్బులు గుంజడమే వీరి ప్రవృత్తి అని డిఎస్పి గారు తెలిపారు.