కేఫ్ జి ని ప్రారంభించిన కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
On
విశ్వంభర, హైద్రాబాద్ : దిల్సుఖ్ నగర్ లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేఫ్ జి టీస్టాల్ ను ఎన్ పి గ్రూప్ ఆఫ్ హోటల్ యాజమాన్యం నూతనంగా ప్రారంభించారు. ఈ హోటల్ ప్రారంభానికి గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి హోటల్ ని ప్రారంభించారు. కె నరేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎన్ పి గ్రూప్ సంస్థ ద్వారా మరిన్ని బ్రాంచ్ లను హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.