బైరాముల్ గూడలో సిపిఎం పార్టీ చంపాపేట శాఖ మహాసభ

బైరాముల్ గూడలో సిపిఎం పార్టీ చంపాపేట శాఖ మహాసభ

   విశ్వంభర, హైద్రాబాద్ :   సిపిఎం పార్టీ చంపాపేట శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన  మహాసభ కు  ప్రభాకర్  అధ్యక్షత వహించారు.  ఈ సభకు  ముఖ్యఅతిథిగా  రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి,  రవీందర్  యాదవ్  హాజరై మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లేని అర్హులైన కుటుంబాలకు  రేషన్ కార్డు ఇవ్వాలని ,  కేంద్ర బిజెపి ప్రభుత్వం  కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా  చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులు తీసుకున్న అప్పులను  17 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని  తెలిపారు అదేవిధంగా వృత్తిదారులకు కార్మికులకు పేదలకు నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కల్పించాలని అన్నారు.  కరోనా సమయంలో వారిని ఆదుకోకుండా ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని,  కార్మిక చట్టాలను మారుస్తూ 4 లేబర్ కోడ్స్ ను కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చిందన్నారు.WhatsApp Image 2024-09-25 at 16.31.15    వ్యవసాయ కూలీల చట్టాలను రైతుల చట్టాలను మారుస్తూ పేదల పొట్టలు కొడుతూ పెద్దలకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జెమిలి ఎన్నికల పేరుతో ఒకటే కార్డు, ఒకటే ఓటు, ఒకటే మతం , ఒకటే ఓటు ఎన్నికలు అంటూ మరోసారి ప్రజలకు ఉన్న హక్కులన్నీ తీసివేయడానికి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం  చూస్తూ ఉందని  భారత రాజ్యాంగంలో  ఉన్న హక్కులను   ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు  అందకుండా రాజ్యాంగాన్ని మార్చటానికి  బిజెపి ప్రభుత్వం కుట్ర  పండుతుందని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.  రాసిన భారత రాజ్యాంగాన్ని.  కాపాడుకోవాల్సిన బాధ్యత  భారత ప్రజల పైన ఉన్నది అన్నారు. ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య  మాట్లాడుతూ   తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి సంబంధం లేని బిజెపి పార్టీ ప్రజలకు రంగు పూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  భూమికోసం భుక్తి  కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సామాజిక వివక్ష అణచివేత  మీద సమైక్య పోరాటమే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని,  ఆ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులని నిజాం రజాకార్ల భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం 3 వేల గ్రామాల్లో   ఈ పోరాటంలో వేలాది మంది వీరమరణం పొందారని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ  ప్రారంభమైన నాటి నుంచి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు మరో ముగ్గురుతో తొలి సమావేశం జరిగింది.  నిజాం ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీగా 1941 ఒకటిలో ఏర్పడింది ఎర్రజెండా నాయకత్వంలో. ప్రజలందరూ  తిరగబడ్డారు                  తప్పని పరిస్థితుల్లో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశం లో విలీనం   కమ్యూనిస్టుల విజయం  అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట  స్ఫూర్తిని CPM పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి. కొనసాగించారు. ఆయన మరణించడం ప్రపంచ కమ్యూనిస్టు దేశాలకు తీరని లోటు అని  జోహార్లు అర్పించారు. చంపాపేట డివిజన్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి ప్రజా సమస్యల పరిష్కరించేంతవరకు ప్రజల పక్షాన కమ్యూనిస్టులుగా  మనం పోరాటం చేయాలని గతంలో వచ్చిన వర్షాలకు  రోడ్డుకు ఎక్కడికక్కడ కొట్టుకుపోయి  గుంతలు గుంతలు గా మారుతున్న జిహెచ్ఎంసి అధికారులు. కార్పొరేటర్లు  పట్టించుకోవడం లేదు.  ప్రభుత్వం   6 గ్యారంటీలును అమలు చేయాలని , ఇండ్లు రేషన్ కార్డులు పింఛన్లు హైడ్రా ప్రజల్లో సమస్యలు తీవ్రంగా  ఉందన్నారు. ఆ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేందుకు పోరాటాలు చేయాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ సభ్యులు రామస్వామి, చంపాపేట శాఖ  నూతన  కార్యదర్శిగా  దుర్గారావు ను  సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  సభ్యులు గణేష్, ప్రభాకర్, కోటేశ్వరరావు, గోపి, నగేష్,  యేసు చిన్న , కోటేష్ తదితరులు పాల్గొన్నారు.  

 

Read More చండూరులోని  సన్ షైన్ హైస్కూల్ స్వచ్ఛతా  హి సేవ  అవగాహన కార్యక్రమం

Tags: