ప్రభుత్వ కళాశాలను సందర్శించిన కాంగ్రెస్ నేతలు
On
విశ్వంభర, కూకట్ పల్లి : కూకట్ పల్లి లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలు గత 20 సంవత్సరాల నుంచి ఎటువంటి మరమ్మతులకు నోచక అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, ఇందులో చదువుతున్న 3400 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానికులు కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ ను సంప్రదించారు. వెంటనే బండి రమేష్, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కాలేజీని సందర్శించి ప్రభుత్వం తో మాట్లాడి నూతన భవన నిర్మాణం చేపడతామని ప్రిన్సిపల్ వెంకటేశ్ కి తెలిపారు.



