వయనాడ్ బాధితుల కోసం విరాళాలు సేకరణ.
On
విశ్వంభర, ఎల్బీనగర్ : కేరళ వయనాడ్ బాధితులకు ప్రజల నుండి విరాళాలు సేకరణ రామకృష్ణాపురం డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్, గడ్డి అన్నారం లో షాప్ టు షాప్ తిరిగి బాధితులకు విరాళాలు సేకరించారు. ఈ సేకరణకు రంగారెడ్డి జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వల్ల వయనాడ్ లో వందల మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రాణ నష్టంతోపాటు, ఆస్తి నష్టం కూడా అధికంగా జరిగిందని వారిని ఆదుకునేందుకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ సర్కిల్ సిపిఎం పార్టీ కార్యదర్శి సిహెచ్ వెంకన్న, సర్కిల్ కమిటీ సభ్యులు ఎం వీరయ్య, కే శ్రీనివాస్, ఎం గోపి నాయక్, జి మనోహర్, జి చైతన్య, కె కృష్ణ, తదితరులు పాల్గొన్నారు