హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ - కాగ్నిజెంట్‌ తమ కొత్త క్యాంపస్ ను రేపు (ఈనెల14న) శంకుస్థాపన..

హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ - కాగ్నిజెంట్‌ తమ కొత్త క్యాంపస్ ను రేపు (ఈనెల14న) శంకుస్థాపన..

కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి -  హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ తమ కొత్త క్యాంపస్ ను రేపు (ఈనెల14న) శంకుస్థాపన చేయనుంది.

విశ్వంభర, హైద్రాబాద్ :  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్ తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్​ చేస్తుంది.

Tags: