ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు

WhatsApp Image 2024-07-22 at 13.59.50_b2490d5cవిశ్వంభర  జూలై 22 : -ఇచ్చిన హామీలు నెరవేర్చ నందున రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాశం వెంకటేశ్వర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుండి 42 శాతానికి పెంచుతామని హామీ ఏమైందన్నారు .గొల్ల కురుమలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రెండవ దశ గొర్రెల పంపిణీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు లబ్ధిదారుని ఎకౌంట్లో వేస్తామన్న హామీ మరిచి గొల్ల కురుమలను మోసం చేశారన్నారు.ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని మంది పడ్డారు అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువతకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా, పూచికత్తు లేకుండా పది లక్షల రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఆరు నెలల్లోగా ఇస్తామని ఇవ్వకుండా బీసీ యువతను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారన్నారు సమయం గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సంఘాలకు చేప పిల్లల పంపిణీ చేయకుండా, బిడ్లు ఆహ్వానించి 100 కోట్ల రూపాయల వరకు అవినీతికి తెర లేపినట్టుగా అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బి.సి లకు ఇచ్చిన హామీ వారం రోజుల్లో చర్యలు ప్రారంభించకపోతే లక్షల మంది బీసీలతో అన్ని కలెక్టరేట్లలో ధర్నాలు నిరసనలు దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ వేణుగోపాల్ కి వినతి పత్రం అందజేశారు.WhatsApp Image 2024-07-22 at 13.59.48_8f9f4181
పాల్గొన్నవారు :  ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల సురేందర్ యాదవ్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి  సంజయ్ గణతి , ఓబీసీ మోర్చా రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి కూతురు మురళి , ఎల్.బి నగర్ అసెంబ్లీ కన్వీనర్ పోల్కం ప్రశాంత్ ముదిరాజ్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రాంపురం శ్రీనివాస్ కార్పొరేటర్ ప్రేమ్ మహెహ్శ్వర్ రెడ్డి , ఓబీసీ మోర్చా మహిళా కన్వీనర్ లక్ష్మి ప్రసన్న వివిధ ఓబీసీ మోర్చా జిల్లా మరియు డివిజన్ నాయకులూ పాల్గొన్నారుWhatsApp Image 2024-07-22 at 14.02.56_ce81ff2e