26 న మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు

WhatsApp Image 2024-07-24 at 14.07.53_f6eb0e5f

 విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : - తెలంగాణ అసెంబ్లీలో  గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం కలసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 26న మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్ను సందర్శిస్తామని తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో చెప్పారు. లక్షల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం లేదని దుయ్య బట్టారు. కాంగ్రెస్, బీజేపీని చెరో ఎనిమిది సీట్లలో గెలిపిస్తే రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు.

Read More పండుగలు సాంప్రధాయానికి ప్రతీకలు: సెక్రటరీ సుదర్శన్ రెడ్డి.