వైభవంగా బోనాల జాతర
విశ్వంభర,మేడిపల్లి : ఆషాడ మాసంలో నిర్వహించే బోనాల పండుగ అనేది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ లో అంగరంగ వైభవంగా బోనాల జాతర కన్నులు పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీర్జాదిగూడలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారని, ఆ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందజేసే విధంగా అందరూ కలిసికట్టుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, మధుసూదన్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రఘువర్దన్ రెడ్డి, జావేద్ ఖాన్, మహిళా అధ్యక్షురాలు నిర్మల,యూత్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు, శంకర్ రావు, కిరణ్ తదితరులు.