వాగులో పడ్డ బొలెరో ట్రాలీ..

4విశ్వంభర భూపాలపల్లి జూలై 19 :-  భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరకుంట-గుండ్రాత్ పల్లి మధ్యలోని అలుగు వాగులో ఓ సరకు రవాణా ట్రాలీ వాహనం కొట్టుకుని పోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వంట పాత్రలు, సామగ్రి విక్రయించే సరకు రవాణా ట్రాలీ వాహనం  అన్నారం నుంచి దామెరకుంట వైపు వెళ్తుంది. అలుగు వాగు ఉద్ధృతిని గమనించకుండా డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వాహనం వాగులో కొట్టుకునిపోయింది. దీంతో డ్రైవర్ వాహనంపైకి ఎక్కి ఆర్తనాదాలు చేశారు. గమనించిన గ్రామస్థులు అతనిని రక్షించారు. అయితే గురువారం సాయంత్రం నుంచే అలుగు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు.