ఘనంగా బిఎంఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
విశ్వంభరా, ఎల్బీనగర్ : -బి ఎం ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ జి డబుల్ ఫోర్ ఫైవ్ బిఎంఎస్ అనుబంధం రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ లోని భూపాల్ నగరంలో ఆవిర్భవించిన భారతీయ మజ్దూర్ సంఘం 70 వసంతంలోకి వచ్చిందన్నారు. పీవీ నరసింహారావు , మన్మోహన్ సింగ్ లు ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడు బి ఎం ఎస్ దేశంలోని కార్మిక రంగంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు . పరిశ్రమ నాది అనుకున్నప్పుడు మాత్రమే కార్మికుడు కష్టించి పనిచేస్తాడు అందుకే కార్మికులను పరిశ్రమలలో భాగస్వాములుగా చేయాలని భారతీయ మద్దూర్ సంఘం కోరుతుంది అని అన్నారు.బి ఎం ఎస్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది అని భారతీయ మజ్దూర్ సంఘం సభ్యులు ఐదు కోట్లకు పైనే ఉంటారు అని తెలిపారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చందర్ రావు , టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ , హైదరాబాద్ సౌత్ రీజినల్ ప్రెసిడెంట్ చందు , రీజినల్ సెక్రటరీ ఎల్ శ్రీనివాస్ , చార్మినార్ డివిజన్ అధ్యక్షులు నరేష్ యాదవ్ , డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ , సుల్తాన్ బజార్ సెక్షన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.