ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు.
విశ్వంభర, ఎల్బీనగర్ : - బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జన్మదిన వేడుకలు ఆర్కే పురం డివిజన్ బి అర్ ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మహేశ్వరం నియోజకవర్గము
ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ ఆద్వర్యం లో గణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
కేక్ కటింగ్ చేసి ,టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా అరవింద్ శర్మ మాట్లాడుతూ.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయడంలో కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారన్నారు. ఆపద లో ఉన్నాను అని ఒక్క ట్వీట్ చేస్తే అర్థరాత్రి కూడా స్పందించే మానవతావాది కేటీఆర్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా సేవ చేయడంలో కేటీఆర్‌ది అందెవేసిన చెయ్యి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో రాష్ట్రం ఎంతో ప్రగతి పథంలో నడిచింది అన్నారు. కాంగ్రెస్ 7 నెలలో పాలనలో అభివృద్ధి కుంటుపడింది అని అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు గొడుగు శ్రీనివాస్, సాజీద్, కొండ్ర శ్రీనివాస్, జై శ్రీమన్నారాయణ, శ్యాం గుప్త, పెంబర్తి శ్రీనివాస్,. మహేందర్ రెడ్డి, ముచింతల జగన్, శ్రీరాములు, యాదగిరి, దీపక్, డివిజన్ జనరల్ సెక్రటరీ లు సిద్దగోని వెంకటేష్ గౌడ్, మురళీదర్ రెడ్డి లు పాల్గొన్నారు.