ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటీ మేయర్ కుమారుడు అఖిలేష్ గౌడ్ జన్మదిన వేడుకలు 

ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటీ మేయర్ కుమారుడు అఖిలేష్ గౌడ్ జన్మదిన వేడుకలు 

వాటర్ ప్లాంట్ నిర్మాణానికి ఆర్థిక సహాయం

విశ్వంభర, బోడుప్పల్: డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ కుమారుడు కొత్త అఖిలేష్ గౌడ్ జన్మదిన సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి గాను కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ గౌడ్ పాల్గొని  కొత్త అఖిలేష్ గౌడ్ ను ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే సంకల్పంతో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు ఇచ్చిన డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపారు. మంచి చేయాలనే ఆలోచన ఉన్న  వ్యక్తి ఏదో ఒక రూపకంగా చేయూతనిస్తాడని, అదేవిధంగా ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల కోసం ఆలోచించిన డిప్యూటీ మేయర్ గౌరవ సత్కారానికి అర్హులు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు  కొత్త విక్రం గౌడ్,బోడుప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసర్ల బీరప్ప ,చంటి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: