పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.

WhatsApp Image 2024-07-24 at 11.38.34_7a42e559

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం V3 విశ్వంభర న్యూస్ : - పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. 

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

 
భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు జరిగిన బదిలీల్లో భాగంగా డాక్టర్లు అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్లారు ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఇద్దరు నిండు గర్భిణీలకు పురుడు పోయాల్సిన అవసరం వచ్చింది. 
 
ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు వరద ప్రాంతాల సందర్భంగా ఉన్నప్పటికీ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు గర్భిణీలకు పురుడు పోశారు. 
 
ఇద్దరు గర్భిణీలు పండంటి శిశువులకు  జన్మనిచ్చారు. 
 
భద్రాచలం నియోజకవర్గం లోని ప్రజలందరికీ ఎంతో కాలం నుంచి అనేక సేవలు చేస్తూ వచ్చిన డాక్టర్ తెల్లం వెంకట్రావు మరోసారి మానవత్వం చూపుకోవడంతో నియోజకవర్గ ప్రజల్లో డాక్టర్ తెల్లం వెంకట్రావు పై ఎనలేని అభిమానం పెరిగింది. 
 
మా ప్రాంతంలో పుట్టి మా ప్రాంతంలో పెరిగి మా వద్ద డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తెల్లం వెంకట్రావుకు ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే ఇక్కడ పనిచేస్తున్నారని ప్రజలంతా డాక్టర్ తెల్లాం వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు