గ్రేటర్ హైదరాబాద్ గౌడ సంఘం అధ్యక్షుడిగా బందారం 

గ్రేటర్ హైదరాబాద్ గౌడ సంఘం అధ్యక్షుడిగా బందారం 

విశ్వంభర, హైదరాబాద్ : అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ కూరెళ్ల వేములయ్య గౌడ్ చేతుల మీదుగా బందారం అనిల్ గౌడ్‌ను అఖిల భారత గౌడ సంఘం గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని మంగళవారం నగరంలో అందజేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడు బందారం అనిల్ గౌడ్ మాట్లాడుతూ,  గౌడ కుల ఐక్యత, యువత నాయకత్వం, మహిళా సాధికారత ప్రధాన లక్ష్యాలుగా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో అఖిల భారత గౌడ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా ,  ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు బోయేపల్లి శ్రీలత గౌడ్, దుపాటి శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: