ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి శుక్లాల ఆపరేషన్లు ప్రారంభం
విశ్వంభర, వెల్దండ, జూలై 25 : - ఐక్యత ఫౌండేషన్ శంకర నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరంలో నేటి నుండి కంటి శుక్లాలకు ఆపరేషన్లు ప్రారంభమయ్యాయని ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా గడిచిన 6 రోజులలో దాదాపు 1500 మంది పేషంట్లకు కంటి పరీక్షలు నిర్వహించగా 115 మంది పేషెంట్లకు కంటి శుక్లాల సర్జరీ ప్రిపేర్ చేయడం జరిగిందని,వీళ్ళందరికీ గురువారం నుండి కంటి శుక్లాలకు సర్జరీల ప్రక్రియ ప్రారంభమవుతుందని వీరితో పాటు 840మందికి పైగా కంటి అద్దాల పంపిణీ చేశామని
మరియు నూట అరవైకి పైగా పేషెంట్లని చెన్నై శంకర నేత్రాలయ బేస్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది అని ఈ కంటి వైద్య శిబిరం ఈనెల 27 తారీఖు వరకు కొనసాగుతుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రాంత నిరుపేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని, అందరూ
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, శ్రీపతి యూసుఫ్ బాబా, శేఖర్, శివ, తదితరులు పాల్గొన్నారు.