మాజీ ముఖ్యమంత్రికి ఆర్య వైశ్య మహాసభ ఘన నివాళులు
On
హైద్రాబాద్ , విశ్వంభర :-మాజీ ముఖ్యమంత్రి కీ.శే కొణిజేటి రోశయ్య జయంతి సందర్బంగా ఖైరతాబాద్ ఆర్య వైశ్య మహాసభలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మి నారాయణ , మహిళా విభాగ అధ్యక్షురాలు ఉప్పల శారద,కోశాధికారి కాచం సుష్మ లు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి గా ,తమిళనాడుకి గవర్నర్ గా పలు పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు అని, వారు చేసిన సేవలను కొనియాడారు . అలాగే వైశ్య కుటుంభంలో పుట్టిన తాను వైశ్య జాతికి ఎన్నో విధాలుగా సేవలు అందించిన మహనీయుడు అని అన్నారు .పలువురు ఆర్య వైశ్య మహాసభ నాయకులు పాల్గొన్నారు