షబ్బీ బరాత్ కు ఏర్పాట్లు 

షబ్బీ బరాత్ కు ఏర్పాట్లు 

విశ్వంభర, రామన్నపేట: మంగళవారం రోజు షబ్బీ బరాత్ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని కబ్రస్థాన్ పరిసరాలను గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ గ్రామస్తులతో కలిసి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్,  ఉప-సర్పంచ్ మోటి రమేష్, వార్డు సభ్యులు మోటే మహేష్, బండ లింగస్వామి, మొహమ్మద్ వాహిద్, మొహమ్మద్ అక్రం, మొహమ్మద్ నాసర్, మొహమ్మద్ అజార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: