పరిగి నియోజకవర్గంలో మరో మైలురాయి ఆవిష్కృతం- ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
On
విశ్వాంబర, పూడూరు :- మండల పరిధిలోని దామగుండం అడవి ప్రాంతంలో శుక్రవారం భారత నేవిదళం రాడార్ ఏర్పాటు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పి నారాయణరెడ్డి తో కలిసి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 2500 కోట్లతో ఈనెల 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేవీ రాడార్ స్టేషన్ ను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
హెలి ఫ్యాడ్, సభ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు లాలూ కృష్ణ, డిసిసి కార్యదర్శి పెంటయ్య, కాంగ్రెస్ నాయకులు ఆనందం, కుమ్మరి స్వామి, భాస్కర్, రాజ పుల్లారెడ్డి, శ్రీనివాస్ గుప్తా, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.