బుద్ధి నాథ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదానం
On
విశ్వంభర, ఆమనగల్లు: ఆమనగల్లు మండల కేంద్రంలోని బుద్ధి నాథ్ గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ నవ రాత్రులు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా గణేష్ విగ్రహాన్ని నెలకొల్పి కౌన్సిలర్ గోరటి జ్యోతి నరసింహకు మొదటి రోజు శాలువాతో సన్మానం చేశారు. అనంతరం అధ్యక్షులు జంతిక శివ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా తొమ్మిది రోజులపాటు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చలి చీమల సతీష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.