ఆమనగల్లులో అమ్మ బాట అంగన్వాడి బాట 

7-2విశ్వాంబర, ఆమనగల్లు, జూలై 23:- ఆమనగల్ ఐసిడిఎస్ మున్సిపల్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్ వాడీ కేంద్రంలో అమ్మ బాట - అంగన్ వాడి బాట' కార్య క్రమంలో భాగంగా "సామూహిక అక్షరాభ్యాసాలు" నిర్వహించారు.

7

Read More ఎమ్మెల్సీ రమణ కు శుభాకాంక్షలు తెలిపిన కళ్లేపల్లి రాజు నేత

ఆమనగల్ ఐసిడిఎస్ సూపర్వైజర్ పార్వతి ఈ సందర్భంగా  కార్యక్రమంను ఉద్దేశించి  మూడు  సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీలో నమోదు కావాలని దానికి తల్లిదండ్రులు సహకరించాలని  అంగన్వాడి కేంద్రాలలో ఆటపాటలు నేర్పించడంతో పాటు చిన్నతనంలో విద్య పైన అవగాహన పెంపొందించి సరైన పౌష్టకాహారం సమయానికి అందించడం జరుగుతుందనీ తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు శబరి, సరళ, తిరుమల, పద్మ, కవిత, బాలమణి టిచర్లు సంద్య, రాజ్యలక్ష్మి, రజిత , నాగమణి, లక్ష్మీ. సరూప, భబిత  మరియు విద్యార్థినీ విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.