అమిత్ షా నా ఇంటిపై దాడి చేయించారు: అసదుద్దీన్

అమిత్ షా నా ఇంటిపై దాడి చేయించారు: అసదుద్దీన్



ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలోని ఇంటిపై మరోసారి దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై మరోసారి దాడి చేశారు. ఇంటి ముందు భారత్ మాతాకి జై తో పాటు కొన్ని పోస్టర్లు అంటించారు. అయితే రీసెంట్ గానే పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఓవైసీ ఓ నినాదం చేశారు. 

Read More విద్యార్థుల‌కు క‌న్న‌బిడ్డ‌ల్లా చూసుకోవాలి:సీఎం రేవంత్‌రెడ్డి

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జై పాలస్తీనా అంటూ నినాదం చేశారు. దానిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఓవైసీ అలా మాట్లాడటాన్ని తప్పుబడుతూ ఆయన ఇంటికి పోస్టర్లు అంటించారు బజరంగ్‌ దళ్ కార్యకర్తలు. కాగా దానిపై తాజాగా అసదుద్దీన్ తీవ్రంగా స్పందించారు. తన ఇంటిపై పదే పదే దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. 

హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోనే ఈ దాడులు అన్నీ జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఎంపీల భద్రతకు గ్యారెంటీ ఉందో లేదో చెప్పాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ తరహా దాడులు తనను భయపెట్టలేవని, ఈ సావర్కర్ తరహా పిరికి ప్రవర్తనను ఆపాలని ఆగ్రహం తెలిపారు. పార్లమెంట్ లో తాను ఏం మాట్లాడినా సరే వెంటనే దాడులు చేయడం అలవాటు అయిందంటూ గుర్తు చేసుకున్నారు.