కొరటికల్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి

WhatsApp Image 2024-07-04 at 5.52.43 PM

విశ్వంభర, ఆత్మకూరు(ఎం)జూలై 04 : 

Read More డిగ్రీ కళాశాలకు చైర్లు, ఇతర సామాగ్రి బహుకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కొరటికల్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు పల్లపు విజయ్ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు   మహోజ్వల శక్తి అని అన్నారు . అతను ప్రజల కోసం  చేసిన సాయుధ పోరాటం గురించి ఎంత చెప్పిన తక్కువే అని అన్నారు . ఆనాడు  బ్రిటీష్ సామ్రాజ్యాన్నే గడ గడలాడించిన వీర యోధుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు .  ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చిన్నం ఏలెందర్ , అల్లూరి యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు .