అర్హులైన వారికి మీ సేవను కేటాయించాలి 


మండల ఏపీఎం కార్యాలయంలో వినతిపత్రం అందజేత 

WhatsApp Image 2024-07-08 at 4.15.41 PM

విశ్వంభర చివ్యేంల : మండలం బండమీది చందుపట్ల గ్రామానికి వచ్చిన మీసేవ అర్హులైన వారికి కేటాయించాలి అని గ్రామ యువకులు మండల ఏపీఎం కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో చైతన్య యుజన మండలి అధ్యక్షులు బాషిపంగు సునీల్ మాట్లాడుతూ చందుపట్ల గ్రామంలో సంఘ బంధం, సమభావన సంఘంలో సభ్యురాలిగా ఉండి చదువుకున్నటువంటి యువతులు 200 పైగా ఉన్నారు. ఇప్పటివరకు గ్రామంలో నోటీసు బోర్డులో పెట్టలేదని ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక యువతులు ఇబ్బందులు పడుతుతున్నారని అన్నారు. మీ సేవ పొందడానికి గ్రామంలో ఉన్న యువతులకు 
 విద్యా అర్హతతో కూడిన ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కేటాయించాలని డిమాండ్ చేశారు. 
అదే విధంగా గ్రామంలో నిరుద్యోగ యువతులు ఉన్నందున వారికి కేటాయించాలి గాని ఏకపక్ష నిర్ణయాలతో కేటాయించకూడదని అన్నారు. సంఘంలో సభ్యులుగా లేనివారిని నియమిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమంలో  గుద్దేటి మధుసుధన్, కోడి రవి,  కేయ్యల రాజ్ కుమార్, లక్ష్మన్, వాసు, తదితరులు పాల్గొన్నారు.

Read More కార్మికులకు పేద ప్రజలకు కేంద్ర బడ్జెట్ వల్ల ఉపయోగం లేదు