ఐక్యత శంకర నేత్రాలయ వారి ఉచితకంటి వైద్యశిబిరం
విశ్వంభర ఆమనగల్లు : - ఐక్యతఫౌండేషన్ శంకరనేత్రాలయ సంయుక్త ఆధ్వ ర్యంలో వెల్దండ మండలకేంద్రంలోని ఏవిఆర్ ఫంక్షన్ హాల్లో ఉచితకంటివైద్య శిబి రాన్ని గత మూడురోజుల నుండి కొనసాగుతుంది. ఆదివారం కంటి వైద్యశిబిరాన్ని ఐక్యత ఫౌండేషన్చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి సందర్శించి రోగులకు కంటి అద్దాలను పంపిణీచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ నిరుపేద ప్రజల కోసం ప్రముఖ కంటి వైద్యనిపుణులు శంకర నేత్రాలయవారిని అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ముఖ్యంగా కంటిశుక్లాలకు సర్జ రీలు చేయడం జరుగుతుంది. ఈకంటి శుక్లాలసర్జరీ ఖర్చుతోకూడుకున్నది, ఆర్థిక ఇబ్బందులవలన చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నవారు సర్జరీ చేయించుకోలేని పరిస్థితులలో ఉన్నారు వారందరిని దృష్టిలో ఉంచుకొని ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేయడం జరిగిందని, ఈనెల 27వరకు ఈశిబిరం కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యువజనకాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్, దళపతిగౌడ్, సీనియర్ నాయకులు మాజీసర్పంచ్ రచ్చశ్రీరాములు, పంతునాయక్, నరేందర్ గౌడ్, యువజన నాయకులు శ్రీనివాసడ్డి, మల్లయ్య, రమేష్ నా యక్, అభినన్ రెడ్డి , యూసఫ్ బాబా, గణేష్, మల్లేష్, శేఖర్, శ్రీపతి, శ్రీనునాయక్, శివ, రఘు, హస్సన్, లక్ష్మణ్, శ్రీను, కల్యాణ్ పాల్గొన్నారు.