రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ

 మండల వ్యవసాయధికారి ఆశకుమారి

WhatsApp Image 2024-07-24 at 17.22.42_2a9fc1a1

విశ్వంభర చివ్వేంల : - మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో బుధవారం రైతువేదిక నందు రైతు బీమా దరఖాస్తు ల స్వీకరణ  కార్యక్రమంలో  మండల వ్యవసాయ అధికారి  ఆశ కుమారి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 
కొత్తగా పాస్ పుస్తకం వచ్చిన 18-59 సం.ల రైతులు అందరూ రైతు బీమా కి దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునే వారు రైతభీమ దరఖాస్తు తో పాటు పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ లు జతపరచి రైతు వేదికల్లో సమర్పించమన్నారు.ఈ నెల 30 వ తారీకు  రైతు బీమా దరఖాస్తులకు ఆఖరి తేదీ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణ అధికారి పవన్, రైతులు మొలుగురి.వెంకన్న,పందిరి. వీరా రెడ్డి, సత్తూరి. సోమేష్,ఎల్లమ్మ, తదితరులు ఉన్నారు.

Read More సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల