ఇంద్రేశంలో జోరందుకున్న ప్రచారం
విశ్వంభర, సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం గ్రామం మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ వార్డు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన్నే దుర్గేష్ తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఆదివారం వార్డు పరిధిలోని పలు కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మన్నే దుర్గేష్ మాట్లాడుతూ, ఇంద్రేశం మున్సిపాలిటీలో విలీనం కావడం వల్ల నిధుల ప్రవాహం పెరుగుతుందని, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆయన ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థికి మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు , వార్డు ప్రజలు పాల్గొన్నారు.



