హీరో సుమన్ తల్వార్ కి అరుదైన సన్మానం

WhatsApp Image 2024-07-22 at 17.24.11_40c9a795ముషీరాబాద్,జూలై 22(విశ్వంభర)  : -50 ఏండ్ల సుధీర్గ అనుభవం కలిగిన మార్షల్ ఆర్ట్స్ లో సినీ నటుడు కరాటే లెజెండర్ డాక్టర్ సుమన్ తల్వార్ కు  వరల్డ్ ఇంటర్నేషనల్ కంబాట్ మార్సియల్ ఆర్ట్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నేపాల్ గ్రాండ్ మాస్టర్ సోకే డాక్టర్ జగదీష్ సింగ్ కత్రా చిక్కడపల్లిలోని సాయి గ్రూప్ డిఎస్ రెడ్డి వారి కార్యాలయంలో రుద్రమ దేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమి ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్స్ లక్ష్మీ రవికి శాలువాతో సత్కరించి మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ గ్రాండ్ మాస్టర్ డాక్టర్ సుమన్ తల్వార్ తాను ఇక్కడ లేకపోవడంతో ఈ సర్టిఫికెట్, మెమెంటోను తనకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్లోసినీనటుడు డాక్రర్ సుమన్ మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో కీర్తి ప్రతిష్టలను గడిచారని కొనియాడారు. అంతేకాకుండా వారు ప్రతి క్రీడాకారుడికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క క్రీడాకారుడికి చేయూత నివ్వడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మాస్టర్స్  కన్నన్ గౌడ్, మల్లేష్, డాక్టర్ పూనం శర్మ గుజరాత్ తదితరులు పాల్గొన్నారు