ఎన్కౌంటర్లో భూపాలపల్లికి చెందిన మావోయిస్టు మృతి.

 

WhatsApp Image 2024-07-25 at 17.14.32_22e82e14 విశ్వంభర భూపాలపల్లి జూలై 25  : - భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్‌ విజేందర్ మృతి చెందాడు. బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి వీరస్వామి- రాజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా రెండవ కుమారుడైన అశోక్ స్థానికంగా 7వ తరగతి చదువుకున్నాడు. మొదట డీసీఎం వ్యాన్ డ్రైవర్ గా పనిచేసి అశోక్ కొంతకాలం తర్వాత జనశక్తి పార్టీలో సానుభూతిపరుడిగా పనిచేసిన 2017 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ లోకి చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అశోక్ తల్లి 20 సంవత్సరాల క్రితం చనిపోగా, తండ్రి గత సంవత్సరం మృతి చెందారు. అశోక్ కు ఇద్దరితో వివాహాలు కాగా ప్రస్తుతం వారు విడిపోయి వేరే ఉంటున్నారు. కాగా అశోక్ తండ్రి సంవత్సరికం రోజునే మావోయిస్టు నేతగా ఎదిగిన అశోక్ మృతి చెందడంతో బుద్దారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read More ఉడ్ -బాల్  టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్ర  ప్రభంజనాలు