కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. రోడ్డుకు అడ్డంగా గోడకట్టిన తండ్రి

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. రోడ్డుకు అడ్డంగా గోడకట్టిన తండ్రి

  • ఇంటి ముందు నుంచి వెళ్లాల్సివస్తుందని గోడ కట్టిన వైనం
  • కరీంనగర్ జిల్లా ఎరడపల్లిలో ఘటన

ఇటీవల యువత ప్రేమించిన వారికోసం దేనికైనా సిద్ధమవుతున్నారు. కన్నవారు కాదన్నా ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, గారాల ముద్దుగా పెంచుకున్న కూతురు తన మాట వినకుండా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి అందరూ ఆశ్చర్యపోయే పనిచేశాడు. పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లకుండా ఏకంగా రోడ్డుకు అడ్డంగా గోడనే కట్టేశాడు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో మమత అనే యువతి అదే గ్రామానికి చెందిన రత్నాకర్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. రత్నాకర్ ఇల్లు వారి ఇంటి సమీపంలోనే ఉంటుంది. వారి ఇంటికి వెళ్లాలంటే మమత ఇంటి ముందు నుంచే వెళ్లాలి. పెళ్లి తర్వాత మమత తల్లిదండ్రుల ఇంటి ముందు నుంచే వెళ్లాల్సివస్తుంది. దీంతో కోపంతో మమత తండ్రి రత్నాకర్ ఇంటికి అడ్డంగా రోడ్డుపై గోడ కట్టేశాడు. ఇది చూసిన స్థానికులు నివ్వెరపోతున్నారు.

Read More నర్సింగ్ విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన