మైనర్ బాలికను గర్భవతి చేసిన పాస్టర్ కు 20 ఏళ్లు జైలు శిక్ష

మైనర్ బాలికను గర్భవతి చేసిన పాస్టర్ కు 20 ఏళ్లు జైలు శిక్ష

విశ్వంభర, గుంటూరు జిల్లా : తుళ్లూరు మైనర్ బాలికపై లైంగికదాడికి ఒడిగట్టి గర్భవతి చేసిన పాస్టర్ కు ఇరవై ఏళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు, ఐదో అదనపు జిల్లా జడ్జి నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన ఎన్.కోటేశ్వరరావు (55)చర్చి నిర్వహించేవారు. 2018లో 15 ఏళ్ల బాలికతో కోటేశ్వరరావు అసభ్యంగా ప్రవర్తించి, బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. తల్లి దండ్రులు విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి గర్భవతిగా నిర్ధారించారు. తల్లిదండ్రులు పాస్టర్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ సీహెచ్.రవిబాబు కేసు దర్యాప్తు చేపట్టి, పాస్టర్ను అరెస్ట్ చేశారు. నేరం రుజువుకావడంతో శిక్ష విధించారు.

Tags: