13వ శతాబ్దపు  శ్రీఆది మహావిష్ణువు ను దర్శించుకున్న మునుగోడు MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి -లక్ష్మి దంపతులు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు దేవాలయాల్లో పూజలు 

మంత్రివర్గ విస్తరణ పై ముఖ్యమంత్రి తో చర్చించి అధిష్టానం నిర్ణయం

దేవులమ్మ నాగారం,చౌటుప్పల్, విశ్వంభర:- శ్రీ ఆది మహావిష్ణువు ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా,చౌటుప్పల్ మండలం, దేవులమ్మ నాగారం గ్రామంలో 13వ శతాబ్దపు చారిత్రక ఆలయంలో మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు . చారిత్రక ఆలయానికి వచ్చిన దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించి వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ అర్చకులు. ఈ సందర్బంగా  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తోలి ఏకాదశి సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికి తోలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు  ఆలయాన్ని తొలి ఏకాదశి పర్వదినాన దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ,రాబోయే రోజుల్లో  ఈ ప్రాంత ప్రజలు  సమస్యలు పరిష్కరించడానికి అభివృద్ధి చేయడానికి  కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. తోలి ఏకాదశి సందర్బంగా మహావిష్ణువు స్వామి వారిని దర్శించుకొని  ఈ ప్రాంత ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్ధించానని తెలిపారు. అలాగే మంత్రి వర్గ విస్తరణ పై రిపోర్టర్ లు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ పై ముఖ్యమంత్రి తో చర్చించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, కమిట్మెంట్ ఉన్న నాయకులకు మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుందని తెలియజేసారు . ప్రభుత్వం ఏర్పడ్డాక  పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ  విస్తరణ వాయిదా పడడంతో కొంత మేర జాప్యం జరగడం త్వరలోనే పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ జరిగి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని,అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , ప్రజా ప్రతినిధులు,ఆలయ కమిటీ సభ్యులు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.  

 

Read More నాణ్యమైన కోతలు లేని విద్యుత్తును అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం