గాంధీజీలో 'స్వచ్ఛ సర్వేక్షన్- 2024'
స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ చండూరు కార్యక్రమం
పర్యావరణం పరిశుభ్రత పై అవగాహన సదస్సు
విశ్వంభర, చండూర్ : చండూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో బుధవారం ఉదయం చండూరు మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో రాబోయే గాంధీ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబరు17 నుండి అక్టోబర్ 2 వరకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న "స్వచ్ఛ సర్వేక్షన్ -2024" లో భాగంగా నిర్వహించిన "స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ చండూరు" కార్యక్రమంలో విద్యార్థులకు పర్యావరణం పరిశుభ్రత' పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు విద్యార్ధుల చేత స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఎస్ "స్వచ్ఛతా హి సేవా" అక్షర ఆకారంలో విద్యార్ధుల ప్రదర్శించిన మానవహారం చూడ ముచ్చటగా ఉన్నది. ఈ కార్యక్రమం లో భాగంగా విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్ధి దశ నుండి అందరూ మంచి అలవాట్లు నేర్పుకోవాలనీ, పర్యావరణాన్ని పరిరక్షించాలనీ, మన చుట్టుప్రక్కల వారికి కూడా స్వచ్ఛత పైన అవగాహన కల్పించాలని తెలియజేశారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని, వివిధ రోగాలకు దూరంగా ఉండవచ్చని అయన సూచించారు. ప్లాస్టిక్ ను నిషేధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ యం.అరవింద్ రెడ్డి, వార్డు అధికారులు పూర్ణ చంద్రరావు, బిక్షం, బిల్ కలెక్టర్ మహేష్, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి, కందుల కృష్ణయ్య, పులిపాటి రాధిక, విజయకుమారి, చంద్రశేఖర్, గణేష్, యాదయ్య, యాదగిరి ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.