ఉద్యమ నేత పిడమర్తి రవికి ఎమ్మెల్సీ పదవి ..?

 ఉద్యమ నేత పిడమర్తి రవికి ఎమ్మెల్సీ పదవి ..?

విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా గల మాదిగలకు, ఉద్యమ నేత మాదిగ సామాజిక వర్గానికి చెందిన పిడమర్తి రవి కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నేషనల్ దళిత సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బూదాల బాబురావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకు సముచిత  స్థానం కల్పించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైన మాదిగలకే కేటాయించాలని నామినేటెడ్ పదవుల్లో మాదిగలకు పదవులలో చోటు కల్పించి మాదిగలను రాజ్యాధికారంలో భాగం చేయాలని , తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా మాదిగలకు అవకాశం కల్పించాలని బాబురావు డిమాండ్ చేశారు .  ఈ కార్యక్రమంలో దళిత దండు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రమళ్ళ మొగులయ్య, BSF రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, మాదిగ యూత్ రాష్ట్ర అధ్యక్షులు నక్క మహేష్, మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జెర్రీపోతుల సాయి, నాయకులు మధుకర్ దేవరకొండ నరేష్, జోగు గణేష్, రేవంత్, రాజు తదితరులు పాల్గొన్నారు

Tags: