ఆయుష్ ఆధ్వర్యంలో  ఉచిత వైద్య పరీక్షలు

 ఆయుష్ ఆధ్వర్యంలో  ఉచిత వైద్య పరీక్షలు

హోమియోపతి మండల వైద్యాధికారి శశి ప్రభ ఉచిత వైద్య పరీక్షలు 

విశ్వంభర, ముస్తాబాద్ :  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధాప్య ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.  హోమియోపతి వైద్యులు మెడికల్ ఆఫీసర్ శశి ప్రభ వృద్ధులకు కీళ్ల నొప్పులు మధుమేహం, అధిక రక్త పోటు, మలబద్ధకం, దమ్ము, దగ్గు, మూత్రపిండాలు, నరాలు సంబంధించిన వాటిపై ఉచిత వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులను అందజేశారు.  ఈ సందర్భంగా హోమియోపతి మండల వైద్యాధికారి శశి ప్రభ మాట్లాడుతూ. వృద్ధాప్యంలో  వచ్చే మధుమేహం కీళ్ల నొప్పులు వంటి సమస్యల పై ఉచిత పరీక్షలు చేసి వారికి మందులు అందించామని శిబిరంకు రానివారు ముస్తాబాద్ లో హోమియోపతి ఆసుపత్రికి  వచ్చి ఉచిత పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామంలోని ఆయుష్ వైద్య  శిబిరంకు అధిక సంఖ్యలో వృద్ధులు పరీక్షలు చేసుకుని ఉచితంగా మందులు తీసుకున్నారు.  ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శశి ప్రభ డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ తిరుపతి, ఫార్మసిస్ట్ రాజేష్, ప్రవీణ్ ఎమ్మెల్ హెచ్ పి   రజిత, రమ్య సిబ్బంది లక్ష్మయ్య ఏఎన్ఎం శాదల  జలేంద్ర, ఆశ వర్కర్ అనిత, కవిత, గంగవ్వ  సంధ్య .విజయ. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

Read More రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులుగా తడక రమేష్ 

Tags: