డీఎస్సీ పరీక్షను వాయిదా వెయ్యాలి
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
విశ్వంభర చివ్వేంల
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు పేరుతో రైతులను మరియు నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు శిగ వీరస్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యులు కోడి బండ్లయ్య విమర్శించారు. చందుపట్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్ రైతులకు సకాలంలో రైతుబంధు ఇచ్చి రైతులకు కావలసినటువంటి ఎరువులను అందుబాటులో ఉంచి మరియు పెట్టుబడి సహాయంగా రైతుబందు వారికి ఉపయోగపడేదని అన్నారు .
ఈ ప్రభుత్వంలో రైతు బంధు ని ఎకరానికి 15000 ఇస్తాo అని చెప్పి ఇవ్వలేదు ఇవ్వకుండా ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి రైతులకు సహాయం చేయవలసిందిగా టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానిలో నిరుద్యోగుల పాత్ర చాలా ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.
DSC ని వాయిదా వేయాలని రాష్ట్రంలోనే ప్రతి ఒక్క నిరుద్యోగి కోరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బండ్లయ్య, గుద్దేటి వెంకన్న, కోడి రవి, ఆంజనేయులు, శీను నాగరాజు, సిగ మదర్, తదితరులు పాల్గొన్నారు.