తైక్వాండో పోటీలలో నాంపల్లి గాంధీజీ విద్యార్థుల ప్రభంజనం. -ట్రస్మా జిల్లా అధ్యక్షులు డా. కోడి శ్రీనివాసులు
ఆత్మ రక్షణకు, శారీరక దృఢత్వాన్ని తైక్వాండో ఎంతగానో పెంపొందిస్తుంది
విశ్వంభర, నాంపల్లి: ఆత్మ రక్షణకు,శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి తైక్వాండో ఎంతగానో దోహదపడుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఈనెల 7వ తేదీన ఆదివారం నాడు నల్లగొండలోని సన్ లైట్ తైక్వాండో ఆకాడమీ, రవీంద్ర నగర్ నందు నిర్వహించిన నల్లగొండ జిల్లా తైక్వాండో ఛాంపియన్ షిప్ -2025 పోటీల్లో నాంపల్లి మండల కేంద్రానికి చెందిన గాంధీజీ విద్యాసంస్థల్లోని విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి, పథకాలను సాధించారు. పథకాలు సాధించిన విద్యార్థుల్లో బి. లలిత మూడవ తరగతి, దేవ వర్షిణి మూడవ తరగతి, ఎ. కీర్తన కుమారి మూడవ తరగతి, కె..నిఖిల్ నాలుగవ తరగతి, జి. విగ్నేష్ నాలుగో తరగతి, జి. జీవన్ ఆరవ తరగతి, టి. ఆదిత్య ఆరవ తరగతి విద్యార్థులు గోల్డ్ మెడల్ పథకాలను, పి.కీర్తన మూడవ తరగతి, ఇ.దేవానంద్ మూడవ తరగతి, డి. అక్షిత్ ఐదవ తరగతి, జె. మహి సాత్విక్ ఆరవ తరగతి సిల్వర్ పథకాలను, టి.విగ్నేష్ మూడవ తరగతి, పి. హర్షవర్ధన్ ఐదవ తరగతి, వి..లోకేష్ ఆరవ తరగతి, సిహెచ్. నిషాంత్ ఆరవ తరగతి కాంస్య పథకాలను సాధించారు. వీరిని మంగళవారం నాడు స్థానిక గాంధీజీ విద్యాసంస్థల్లో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మెడల్స్ ను, సర్టిఫికెట్స్ ను అందించి అభినందించారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ ఈనెల 12,13, 14వ తేదీలలో గద్వాల్ పట్టణంలో నిర్వహించే రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు గాంధీజీ విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పథకాలను సాధించి పుట్టిన ఊరుకు, చదువుకున్న పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశించారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఆత్మర క్షణ కోసం తైక్వాండో నేర్చుకోవాలని అన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి వివిధ వేదికలపై జరిగే కార్యక్రమాలకు విద్యార్థులను పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్స్ సరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, ప్రిన్సిపల్స్ సామల వెంకటేశ్వర్లు, రామేశ్వరి, తైక్వాండో ట్రైనర్ నాగిళ్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.



