కొడాలి నాని ఇంటి మీదకు కోడిగుడ్డు విసిరిన టీడీపీ శ్రేణులు..

కొడాలి నాని ఇంటి మీదకు కోడిగుడ్డు విసిరిన టీడీపీ శ్రేణులు..

ఆయన ఇంటి ముందు హల్ చల్
బయటకు రావాలంటూ సవాల్

విశ్వంభర, గుడివాడః ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేతలంతా ఓడిపోయారు. ఇన్ని రోజులు తిరుగులేని పవర్ లో ఉన్న వారంతా ఇప్పుడు ఓడిపోవడంతో వారిని దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ మంత్రులు, కీలక నేతలు అందరూ కొన్ని సార్లు హద్దులు దాటి మాట్లాడిన ఘటనలు కూడా ఉన్నాయి. 

అయితే ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఓడిపోవడంతో ఆయన్ను టీడీపీ శ్రేణులు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద శుక్రవారం నాడు టీడీపీ శ్రేణులు హంగామా సృష్టించారు. దాంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటి ముందు టీడీపీ శ్రేణులు హల్ చల్ చేశారు. 

Read More డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు

దమ్ముంటే బయటకు రావాలంటూ సవాల్ విసిరారు. ఆయన ఇంటి మీదకు కోడిగుడ్లు విసిరారు. అయినా సరే కొడాలి నాని మాత్రం బయటకు రాలేదు. ఇక పోలీసులు అక్కడకు చేరుకుని టీడీపీ శ్రేణులను అక్కడి నుంచి పంపించేశారు. దాంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.