Karnataka Chief Minister Siddaramaiah - Vishvambhara News

పెట్రోల్ ధరల పెంపుపై కర్ణాటక సీఎం సంచలన వ్యాఖ్యల
విశ్వంభర, కర్ణాటక : కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. పెట్రోల్ ధరల లీటర్‌కు రూ. 3 పెంచామని, అయినప్పటికీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కర్ణాటకలో ఇంధన ధరలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని చెప్పారు. 'కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌పై 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం వ్యాట్‌ను పెంచింది.

ఈ పెంపు నిర్ణయం తర్వాత కూడా రాష్ట్రంలో ఇంధనంపై పన్నులు ఇతర దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రల కంటే తక్కువగానే ఉన్నాయని ' సిద్ధరామయ్య ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇదే సమయంలో బీజేపీపై ఆయన విమర్శలతో విరుచుకుపడ్డారు. గతంలో రాష్ట్ర వనరులను బీజేపీ ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని ఆరోపించారు. గత రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్‌ను తగ్గించింది.

అయితే, కేంద్ర ప్రభుత్వం తన సొంత పన్నులను పెంచింది. ఈ అవకతవకల వల్ల కర్ణాటకకు ఆదాయం భారీగా తగ్గింది. కేంద్రం ప్రభుత్వం కన్నడిగులను మోసం చేసి తన ఖజానాను నింపుకుందని విమర్శించారు. తాజాగా పెంచిన ఇంధన ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాకు నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రేమలో పడ్డాను కానీ...పెళ్లి చేసుకోలేకపోయా...సిద్దరామయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విశ్వంభర, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డాను కానీ పెళ్లి చేసుకోలేకపోయానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైసూరులో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని కులాంతర వివాహాల విషయంపై మాట్లాడారు. చదువుకునే రోజుల్లో తానూ ప్రేమలో పడ్డానని, కానీ  కులం వేరే అవ్వడం వల్ల ప్రేమను వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు.

తాను వివాహం చేసుకుంటానని అడిగినప్పుడు వారి కుటుంబ సభ్యులతో పాటు ఆ అమ్మాయి కూడా పెళ్లికి ఒప్పుకోలేదని తెలిపారు. దానికి కారణం తాను వేరే కులానికి  చెందిన వాడినవడమేనని పేర్కొన్నారు. దీంతో మరో ఆలోచన చేయకుండా తమ వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లాడానని  చెప్పుకొచ్చారు.

అనంతరం మాట్లాడుతూ... కులాంతర వివాహాలు చేసుకునే వారికి తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని, అవసరమైన సహాయం అందిస్తుందని తెలిపారు. సమాజంలో కుల నిర్మూలన కోసం ఎందరో సంఘ సంస్కర్తలు కృషి చేసినప్పటికీ సమానత్వం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నిర్మూలించాలంటే రెండే మార్గాలు ఉన్నాయన్నారు. ఒకటి కులాంతర వివాహం, మరొకటి అన్ని వర్గాలు సామాజిక, ఆర్ధిక అభివృద్ధిని సాధించడం అని పేర్కొన్నారు.